గురువారం 28 మే 2020
International - Apr 27, 2020 , 18:13:01

స్పెయిన్‌లో 23 వేలు దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

స్పెయిన్‌లో 23 వేలు దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

న్యూఢిల్లీ: స‌్పెయిన్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి కాస్త శాంతించింది. ఇప్ప‌టికీ కొత్త‌గా క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్నా.. సంఖ్యాప‌రంగా కొంత‌మేర‌కు త‌గ్గుద‌ల క‌నిపిస్తున్న‌ది. తాజాగా సోమ‌వారం 331 క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించాయి. దీంతో స్పెయిన్‌లో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 23,251కి చేరింది. ఆదివారంతో పోల్చితే సోమ‌వారం న‌మోదైన మ‌ర‌ణాల‌ సంఖ్య కొంచెం పెరిగింది. ఆదివారం 288 మంది క‌రోనా బాధితులు మ‌ర‌ణించారు. 

ఇక, క‌రోనా పాజిటివ్ కేసుల విష‌యానికొస్తే సోమ‌వారం కొత్త‌గా 1,831 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో స్పెయిన్‌లో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు ల‌క్ష‌ల మార్కును దాటి 2,09,465కు చేరింది. వారిలో ల‌క్ష మందికిపైగా వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మొత్తం కేసుల నుంచి మ‌ర‌ణాలు, కోలుకున్నవారు పోగా.. ఇంకా 85,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo