శుక్రవారం 07 ఆగస్టు 2020
International - Jul 13, 2020 , 10:39:15

బ్రెజిల్‌లో 72000 దాటిన కరోనా మరణాలు

బ్రెజిల్‌లో 72000 దాటిన కరోనా మరణాలు

బ్రెసిలియా : బ్రెజిల్‌లో కరోనా మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు అక్కడ కరోనాతో 72,151 మంది మరణించినట్లు తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 24,831 కరోనా కేసులు నమోదు కాగా 631 మంది మృత్యువాత పడినట్లు అక్కడి ఆరోగ్య శాఖ మంత్రి తెలియజేశారు. బ్రెజిల్‌లో మొత్తం మరణాల సంఖ్య 72,151కి చేరగా, మొత్తం కేసుల సంఖ్య 18,66,176 వద్ద ఉంది.

శనివారం బ్రెజిల్‌లో సుమారు 39,000 కరోనా కేసులు, 1,071 కొత్త వైరస్‌ సంబంధిత మరణాలు సంభవించాయి. శుక్రవారం 1,200 మంది మరణించినట్లు సమాచారం. దేశంలో అంటువ్యాధి ప్రారంభమైనప్పటి నుంచి బ్రెజిల్‌లో 1,213,512 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం యొక్క తాజా సమాచారం ప్రకారం బ్రెజిల్ రెండో అత్యధిక కరోనావైరస్ మరణాల సంఖ్యను కలిగి ఉంది. బ్రెజిల్‌ కంటే ముందు యూఎస్‌లో మరణాల సంఖ్య అధికంగా ఉంది. అక్కడ ఇప్పటివరకు 1,37,000 మంది కరోనాతో మరణించినట్లు సమాచారం. అక్కడ కేసుల సంఖ్య 3.37 మిలియన్లుగా ఉంది. కరోనాతో అత్యధికంగా మరణించిన దేశాల్లో మొదటి స్థానంలో యూనైటెడ్‌ స్టేట్స్‌ ఉండగా రెండో స్థానంలో బ్రెజిల్‌ ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo