శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 04, 2020 , 08:55:50

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 59,159

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 59,159

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ఈ వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా కోరలు చాచి.. 59,159 మందిని కాటేసింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,98,390కి చేరుకుంది. 2,28,923 మంది ఈ వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇటలీ, అమెరికా, స్పెయిన్‌, ఫ్రాన్స్‌లో, ఇరాన్‌, యూకేలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. ఈ వైరస్‌ బారిన పడి అత్యధికంగా ఇటలీలో 14,681 మంది చనిపోయారు. స్పెయిన్‌లో 11,198 మంది, అమెరికాలో 7,392 మంది, ఫ్రాన్స్‌లో 6,507, ఇరాన్‌లో 3,294, యూకేలో 3,605 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక అమెరికాలో 2,77,161 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇటలీలో 1,19,827, స్పెయిన్‌లో 1,19,199, ఫ్రాన్స్‌లో 64,338, ఇరాన్‌లో 53,183, యూకేలో 38,168 కేసులు నమోదు అయ్యాయి. జర్మనీలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 91,159(మృతులు 1,275), బెల్జియంలో పాజిటివ్‌ కేసులు 16,770(మృతులు 1,143), నెదర్లాండ్స్‌లో పాజిటివ్‌ కేసులు 15,723(మృతులు 1,487) నమోదు అయ్యాయి.


logo