బుధవారం 03 జూన్ 2020
International - Mar 31, 2020 , 16:39:45

ఇరాన్‌లో కరోనాతో 2,898 మంది మృతి

ఇరాన్‌లో కరోనాతో 2,898 మంది మృతి

హైదరాబాద్‌ : ఇరాన్‌లో మరణ మృదంగం మోగుతోంది. గంట గంటకు కరోనా మృతుల సంఖ్య పెరిగిపోతోంది. మంగళవారం మధ్యాహ్నం నాటికి కరోనా వైరస్‌తో 2,898 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 141 మంది మృతి చెందినట్లు ఇరాన్‌ ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కైనూష్‌ జహాన్‌పూర్‌ మీడియాకు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 3,111 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని, మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 44,606కు చేరిందన్నారు. 3,703 మంది పరిస్థితి విషమంగా ఉందని కైనూష్‌ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం వరకు కరోనాతో 38,748 మంది ప్రాణాలు కోల్పోయారు. 


logo