సోమవారం 01 జూన్ 2020
International - May 07, 2020 , 07:15:56

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 2,65,045

 ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 2,65,045

హైదరాబాద్‌ : కరోనా విలయతాండవానికి ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో 2,65,045 మంది ప్రాణాలు కోల్పోగా, పాజిటివ్‌ కేసుల సంఖ్య 38.21 లక్షలు దాటింది. ఈ వైరస్‌ నుంచి 12.99 లక్షల మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. అమెరికాలో కరోనాతో 74,799 మంది చనిపోగా, నిన్న ఒక్కరోజే 2,528 మంది ప్రాణాలు కోల్పోయారు. 

స్పెయిన్‌లో 25,857, ఇటలీలో 29,684, యూకేలో 30,076, ఫ్రాన్స్‌లో 25,809, జర్మనీలో 7,275, రష్యాలో 1,537, టర్కీలో 3,584, బ్రెజిల్‌లో 8,588, ఇరాన్‌లో 6,418, కెనడాలో 4,232, బెల్జియంలో 8,339, నెదర్లాండ్స్‌లో 5,204 మంది ప్రాణాలు కోల్పోయారు. 


logo