శనివారం 06 జూన్ 2020
International - Apr 03, 2020 , 10:31:32

కరోనాతో ఇటలీలో 13,915 మంది మృతి

కరోనాతో ఇటలీలో 13,915 మంది మృతి

హైదరాబాద్‌ : ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ బారిన పడి 53,218 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,15,877కు చేరుకుంది. ఈ వైరస్‌ బారి నుంచి 2,12,993 మంది కోలుకున్నారు. ఇటలీలో అత్యధికంగా 13,915 మంది చనిపోగా, 1,15,242ల పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. స్పెయిన్‌లో 10,348 మంది, అమెరికాలో 6,088 మంది ఈ వైరస్‌ బారిన పడి మృతి చెందారు.

జర్మనీలో మృతుల సంఖ్య 1,107(పాజిటివ్‌ కేసులు 84,794), ఫ్రాన్స్‌లో మృతులు 5,387(పాజిటివ్‌ కేసులు 59,105), ఇరాన్‌లో మృతులు 3,160(పాజిటివ్‌ కేసులు 50,468), యూకేలో మృతులు 2,921(పాజిటివ్‌ కేసులు 33,718), స్విట్జర్లాండ్‌లో మృతులు 536(పాజిటివ్‌ కేసులు 18,827), టర్కీలో మృతులు 356(పాజిటివ్‌ కేసులు 18,135), బెల్జియంలో మృతులు 1,011(పాజిటివ్‌ కేసులు 15,348), నెదర్లాండ్స్‌లో మృతుల సంఖ్య 1,339(పాజిటివ్‌ కేసులు 14,697)కు చేరింది.


logo