శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 12, 2020 , 10:06:41

క‌రోనా మ‌ర‌ణాలు.. ఇట‌లీని దాటేసిన అమెరికా

క‌రోనా మ‌ర‌ణాలు.. ఇట‌లీని దాటేసిన అమెరికా

హైద‌రాబాద్: క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచంలో అత్య‌ధిక సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌వించిన దేశంగా అమెరికా నిలిచింది.  మ‌ర‌ణాల సంఖ్యలో అగ్ర‌రాజ్యం.. ఇట‌లీని దాటేసింది.  జాన్స్ హాప్కిన్స్ వ‌ర్సిటీ లెక్క‌ల ప్ర‌కారం.. అమెరికాలో ఇప్ప‌టి వ‌ర‌కు 20 వేల మంది మ‌ర‌ణించారు. ఇట‌లీలో తాజా లెక్క‌ల ప్రకారం 19,468 మంది చ‌నిపోయారు. శుక్ర‌వారం రోజున ఒక్క రోజే అమెరికాలో రెండు వేల మంది చ‌నిపోవ‌డంతో.. ఆ దేశ కొత్త మైలురాయి అందుకున్న‌ది. అయితే న్యూయార్క్‌లో మ‌ర‌ణాల రేటు కొంత త‌గ్గిన‌ట్లు ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఆండ్రూ కుమో తెలిపారు. గ‌త 24 గంట‌ల్లో 783 మంది చ‌నిపోయిన‌ట్లు ఆయ‌న చెప్పారు. కేవ‌లం న్యూయార్క్‌లోనే సుమారు ల‌క్షా 80 వేల పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. logo