శుక్రవారం 10 ఏప్రిల్ 2020
International - Mar 24, 2020 , 08:51:56

స్పెయిన్‌లో 2000 దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

స్పెయిన్‌లో 2000 దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

న్యూఢిల్లీ: స్పెయిన్‌లో క‌రోనా వైర‌స్ విజృంభ‌న కొన‌సాగుతూనే ఉంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల‌తోపాటు మ‌ర‌ణాల సంఖ్య కూడా పెరుగుతున్న‌ది. సోమ‌వారం రాత్రిక‌ల్లా ఆ దేశంలో క‌రోనా మ‌రణాలు 2000 మార్కును దాటాయి. ఇక పాజిటివ్ కేసుల సంఖ్య 33 వేలను దాటింది. చైనా, ఇట‌లీ దేశాల త‌ర్వాత క‌రోనా వైర‌స్ ప్ర‌భావం స్పెయిన్‌పైనే ఎక్కువ‌గా ఉన్న‌ది.  స్పెయిన్‌లోని మిగ‌తా ప్రాంతాల కంటే రాజ‌ధాని మాడ్రిడ్ క‌రోనావ‌ల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్న‌ది.  

సోమ‌వారం ఒక్క‌రోజే స్పెయిన్‌లో 462 క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించాయి. దీంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య రెండు వేల మార్కును దాటి 2,182కు చేరింది. క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా 33,089 కి చేరింది. అయితే స్పెయిన్లో  క్యాపిట‌ల్ సిటీ మాడ్రిడ్ పైనే క‌రోనా తీవ్ర ప్ర‌భావం చూపుతున్న‌ది. అక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కు 1,263 మంది క‌రోనాతో మ‌ర‌ణించ‌గా.. మ‌రో 10,575 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.     


logo