గురువారం 28 మే 2020
International - Apr 11, 2020 , 11:25:12

బ్రెజిల్‌లో మూడింత‌లు పెరిగిన మ‌ర‌ణాల సంఖ్య‌..

బ్రెజిల్‌లో మూడింత‌లు పెరిగిన మ‌ర‌ణాల సంఖ్య‌..

హైద‌రాబాద్‌: ఒక్క వారం రోజుల్లోనే బ్రెజిల్‌లో క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య మూడింత‌లు పెరిగింది. ఆ దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 1056 మంది చ‌నిపోయారు.  బ్రెజిల్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 20వేలకు చేరుకున్న‌ది. అయితే క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌ను అధ్య‌క్షుడు జెయిర్ బొల్స‌నారో ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఆయ‌న ఇటీవ‌ల బ్రెసిల్లికాలో ప‌బ్లిక్ షో నిర్వ‌హించారు.  మ‌హ‌మ్మారి క‌న్నా ఆర్థిక విప‌త్తే దారుణ‌మైంద‌న్నారు. బ్రెజిల్‌లో అనేక రాష్ట్రాల్లో ఐసోలేష‌న్ ఆంక్ష‌ల‌ను విధించాయి. కానీ బొల్స‌నారో మాత్రం వాటిని ఎత్తివేయాల‌న్నారు.  భార‌త్ వ‌ద్ద మాత్రం హైడ్రాక్సీ మాత్ర‌ల‌ను ఖ‌రీదు చేసేందుకు బొల్స‌నారో ఆస‌క్తి చూపారు.logo