ఆదివారం 07 జూన్ 2020
International - Apr 02, 2020 , 12:38:01

కరోనా: ఆ విహారనౌక నిరవధికంగా సముద్రంలోనే ఉండాలి

కరోనా: ఆ విహారనౌక నిరవధికంగా సముద్రంలోనే ఉండాలి

హైదరాబాద్: హాయిగా నౌకలో విహార యాత్ర చేద్దామని బయలుదేరినవారికి ఇప్పుడు పరిస్థితి జైలులో పడ్డట్టు అయింది. హాలండ్-అమెరికా క్రూయిజ్ నౌక ఎంఎస్ జాండమ్ పరిస్థితి త్రిశంకు స్వర్గంలో పడింది. మార్చి ఏడున బ్యూనోఏరిస్ నుంచి ప్రయాణమైన తర్వాత మళ్లీ ఆ నౌక లంగరేసేందుకు ఏ రేవులోనూ అనుమతి లభించలేదు. మార్చి 13 నాటికి అన్ని ప్రధాన క్రూయిజ్ నౌకలు గమ్యం చేరి యాత్రలు ముగించుకున్నాయి. కానీ ఎంఎస్ జాండమ్ మాత్రం దిక్కూదివాణం లేకుండా సముద్రంలో తిరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న కారణంగా దక్షిణ అమెరికాలోని ఏ దేశమూ తమ రేవుల్లోకి ఆ క్రూయిజ్‌ను అనుమతించలేదు. గత మార్చి 29న అమెరికా తీరరక్షణ దళం ఒక బులెటిన్ విడుదల చేస్తూ 50 మందికి పైగా ప్రయాణికులున్న అన్ని విదేశీ నౌకలు సముద్రంలోనే ఉండిపోయి ఆరోగ్య సంరక్షణ చర్యలు ముమ్మరం చేయాలని, రేవుల్లో దిగితే వైద్య సౌకర్యాలు కల్పించడం అసాధ్యమవుతుందని హెచ్చరికలు జారీ చేసింది. ఏ దేశంలో నమోదయ్యాయో ఆ దేశాలకే రోగులను తరలించాలని కూడా సూచించింది. ఇక్కడ సమస్య ఏమిటంటే అన్ని క్రూయిజ్ కంపెనీలు తమ నౌకలను పన్ను సమస్యల కారణంగా బహమాస్ వంటి చిన్న దేశాల్లో నమోదు చేయించుకుంటాయి. గత డిసెంబర్ లో వచ్చిన తుఫాను నష్టం నుంచే ఇంకా తేరుకోని బహమాస్ వందల, వేల కరోనా రోగులకు సప్రయలు చేసే స్థితిలో లేదు. ఎంఎస్ జాండమ్ వంటి క్రూయిజ్ నౌకలలో ఇరుక్కుపోయినవారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు.


logo