బుధవారం 30 సెప్టెంబర్ 2020
International - Aug 15, 2020 , 10:30:04

బ్రెజిల్‌లో విజృంభిస్తున్న కరోనా

బ్రెజిల్‌లో విజృంభిస్తున్న కరోనా

బ్రెసిలియ : బ్రెజిల్‌లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 50,644కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 3,275,520కు చేరుకుందని జాతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆలస్యంగా తెలిపింది. ఇదే సమయంలో మరణాల సంఖ్య 1,060 పెరిగి 106,523కు చేరింది. అంతకు ముందు రోజు బ్రెజిల్‌లో 60,091 కేసులు నమోదు కాగా 1262 మంది మృత్యువాత పడ్డారు. 

యునైటెడ్ స్టేట్స్‌లో కరోనా కేసులు 5.2 మిలియన్లు దాటగా ప్రపంచ స్థాయిలో కరోనావైరస్ కేసుల్లో యూఎస్‌ తరువాత బ్రెజిల్‌  రెండో స్థానంలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్చి 11న కరోనా వ్యాప్తిని ఒక మహమ్మారిగా ప్రకటించింది. ఈ రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా 21 మిలియన్లకు పైగా ప్రజలు కరోనావైరస్ బారిన పడ్డారని, 761,000 మందికి పైగా మరణాలు సంభవించాయని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo