లండన్‌లో మళ్లీ పెరుగుతున్నకరోనా కేసులు.. క్రిస్మస్ వేడుకలు రద్దు..

లండన్ : కరోనా వైరస్ విజృంభిస్తున్ననేపథ్యంలో ఇంగ్లాండ్ రాజధాని లండన్‌తో సహా పశ్చిమ, ఆగ్నేయ ఇంగ్లాండ్‌లో క్రిస్మస్ వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఆ ఆంక్షలు ఈరోజు (ఆదివారం) ఉదయం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రిగా, దేశ ప్రజల రక్షణ తన బాధ్యత అనీ, ప్రజల భావోద్వేగాలు తనకు తెలుసు కానీ భారమైన హృదయంతో ఆంక్షలు విధించాల్సి వస్తున్నదన్నారు. శతాబ్దాలుగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు ఇంగ్లాండ్ ప్రజలు.
కరోనా కారణంగా ప్రధానమంత్రి బోరిక్ క్రిస్మస్ వేడుకలపై కఠినమైన ఆంక్షలు విధించారు. బంధు మిత్రులతో కలిసి క్రిస్మస్ పండుగ ఘనంగా జరుపుకోవాలని లక్షలాది మంది ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతవరకు టైర్-3 ఆంక్షలు అమలువుతున్న లండన్ నగరం మళ్లీ లాక్ డౌన్‌ను పోలిన టైర్ 4 నిబంధనల్లోకి వెళ్లిపోయింది. లండన్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్తగా కనుగొన్నకోవిడ్-19 రకం వైరస్ శరవేగంగా వ్యాపిస్తుండంతో బ్రిటన్ ప్రభుత్వం తీవ్ర చర్చలకు దిగింది.
ఈ కొత్త వైరస్ రకం ఒరిజనల్ కోవిడ్-19 కంటే ఏమాత్రం తక్కువ స్థాయిలో లేదని, దీని గురించి ఇంతవరకు ఎవరికీ తెలీదని, వ్యాక్సిన్ సైతం దీన్ని సమర్థంగా ఎదుర్కొంటుందని చెప్పలేని పరిస్థితులున్నాయని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సస్ పేర్కొన్నారు.లండన్ చుట్టుపక్కల పుట్టి వ్యాప్తి చెందుతున్న కొత్త కరోనా వైరస్ రకాన్ని గురించి ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియజేశామని వైద్య నిపుణులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం క్రిస్మస్ విభిన్నంగా ఉంటుందని, ప్రజలెవ్వరూ పండుగ సందర్బంలో ప్రయాణాలు పెట్టుకోరాదని, కుటుంబాలను కలవవద్దని బ్రిటన్ ప్రధాని హెచ్చరించారు.
ఆదివారం ఉదయం నుంచి డిసెంబర్ 30 వరకు లండన్‌లో చుట్టుపక్కల ప్రాంతాల్లో కఠినమైన ఆంక్షలు అమలులో ఉంటాయని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. టైర్-4 ప్రాంతాలు మినహా దేశవ్యాప్తంగా డిసెంబర్ 23 నుంచి 27వ తేదీ వరకు కరోనా ఆంక్షల్లో ఇచ్చిన సడలింపులను ప్రభుత్వం రద్దు చేసింది. కేవలం డిసెంబర్ 25న మాత్రమే ఈ సడలింపులు అమల్లో ఉంటాయి. ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని టైర్-3 ప్రాంతాల్లో టైర్-4 ఆంక్షలను అమలు చేస్తారు. కెంట్, బకింగ్హమ్షైర్, బెర్క్‌షైర్, సుర్రే(వేవెర్లీ మినహా), గోస్పోర్ట్, హావెంట్, పోర్ట్స్మౌత్, రోథర్, హేస్టింగ్స్‌లో టైర్-4 ఆంక్షలు ఉంటాయి. ఇంగ్లాండ్‌లో టైర్-4 ప్రాంతంలో ఉన్నవారు క్రిస్మస్ రోజున సొంత ఇంట్లో మినహా బయట ఎక్కడా ఎవరినీ కలవడానికి వీల్లేదు.
ఇంట్లో ఒంటరిగా ఉన్న వారికి మినహాయింపు లభిస్తుంది. ఇతర దినాల్లో విద్య, వైద్యం కోసం బయటకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. టైర్-4 ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి వ్యాయామశాలలు, సెలూన్లు, అత్యవసరం కాని దుకాణాలు మూసివేయాలి. లండన్ నగరంతోపాటు పశ్చిమ ఇంగ్లాండ్‌లోని బెడ్ఫోర్డ్, సెంట్రల్ బెడ్ఫోర్డ్, మిల్టన్ కీనెస్, లూటన్, పీటర్‌బరో, హెర్ట్‌ఫోర్డ్‌షైర్, ఎసెక్స్(కోలచెస్టర్, అటిల్స్ఫోర్డ్, టెండ్రింగ్ మినహా)లో టైర్-4 ఆంక్షలు అమలవుతాయని ప్రభుత్వం పేర్కొంది.
ఇవి కూడా చదవండి... హోండా ప్లాంట్ మూసివేత...?
ట్రైబ్స్ ఇండియా అవుట్ లెట్ లను ప్రారంభించిన అర్జున్ ముండా
యువకుడి వేధింపులకు విద్యార్థిని ఆత్మహత్య...
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
తాజావార్తలు
- ఎవరిని వదిలేది లేదంటున్న డేవిడ్ వార్నర్
- 15 నిమిషాల్లో దోపిడీ చేసి.. 15 గంటల్లో పట్టుబడ్డారు
- అంటార్కిటికా దీవుల్లో భూకంపం..
- డ్రైవరన్నా.. సలాం!
- ఓటీటీలో అడుగుపెట్టబోతున్న మాస్టర్
- ఎర్రలైటు పడితే ఆగాలి.. గ్రీన్ పడ్డాకే కదలాలి
- కోపంతో కాదు ప్రేమతోనే..
- వివాదం పరిష్కారమే ఎజెండాగా.. నేడు చైనాతో భారత్ చర్చలు
- సరికొత్తగా.. సాగర తీరం
- దుబాయ్‌లో ఘనంగా నమ్రత బర్త్‌డే సెలబ్రేషన్స్ .. పిక్స్ వైరల్