సోమవారం 25 మే 2020
International - Apr 06, 2020 , 19:22:44

చైనాలో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు

చైనాలో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు

క‌రోనా కరాళ నృత్యం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ల‌క్ష‌ల మంది బాధితుల‌వ్వ‌గా..వేల‌ల్లో ప్రాణాలు కోల్పోయారు. అయితే కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలోనూ ఇంకా కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఈ రోజు కొత్తగా 39 మందికి కరోనా వైరస్ సోకిందని తేలింది. ఈసారి కరోనా వ్యాధి లక్షణాలు లేకున్నా టెస్టుల్లో కరోనా పాజిటివ్ అని వస్తుండటంతో ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు.   అయితే, గతంలో ఉన్నంత‌ వ్యాప్తి ఇప్పుడు లేద‌ని అక్క‌డి అధికారులు చెప్తున్నారు. చైనాలో 81,669 మందికి కరోనా సోకగా వీరిలో 3,329 మంది మరణించారు. ఒకవైపు కరోనా వైరస్ తగ్గిందని భావిస్తుంటే మరోవైపు కొత్తగా కేసులు బయటపడటం  చైనా వాసులను ఆందోళన కలిగిస్తోంది.


logo