శనివారం 06 జూన్ 2020
International - May 12, 2020 , 15:09:48

నేపాల్‌లో క‌రోనా క‌ల‌క‌లం.. ఒకేరోజు 57 కొత్త కేసులు

నేపాల్‌లో క‌రోనా క‌ల‌క‌లం.. ఒకేరోజు 57 కొత్త కేసులు

ఖాట్మండు: నేపాల్‌లో క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం రేపుతున్న‌ది. ఆ దేశంలో గ‌త నాలుగు నెల‌లుగా 150 కూడా దాట‌ని పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్క‌రోజులో రెండు వంద‌ల‌కు చేరువ‌య్యింది. మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే కొత్త‌గా 57 కొత్త కేసులు న‌మోదు కావ‌డంతో మొత్తం కేసుల సంఖ్య 191కి చేరింది. నేపాల్‌లో క‌రోనా కాలు మోపిన‌ప్ప‌టి నుంచి ఒక్క‌రోజులో ఇన్ని ఎక్కువ కేసులు న‌మోదు కావ‌డం ఇదే మొద‌టిసారి. దీంతో ఆ దేశ పాల‌కులు, అధికార యంత్రాంగంలో క‌ల‌వ‌రం మొద‌లైంది. కొత్త‌గా పాజిటివ్ వ‌చ్చిన అంద‌రినీ క్వారెంటైన్‌కు త‌రలించామ‌ని, అంద‌రి ఆరోగ్య ప‌రిస్థితి మెరుగ్గానే ఉన్న‌ద‌ని నేపాల్ ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. మొత్తం కేసుల‌లో పార్సాలో అత్య‌ధికంగా 64 పాజిటివ్‌ కేసులు ఉన్నాయ‌ని తెలిపారు. 191 మంది బాధితుల్లో 27 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యార‌ని నేపాల్ అధికారులు పేర్కొన్నారు.     

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo