శనివారం 06 జూన్ 2020
International - May 15, 2020 , 15:11:56

నేపాల్‌లో మరింత పెరుగుతున్న కరోనా కేసులు

నేపాల్‌లో మరింత పెరుగుతున్న కరోనా కేసులు

న్యూఢిల్లీ: నేపాల్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో రోజుకు ఒకటి, రెండు కొత్త కేసులు నమోదవుతూ కేసుల సంఖ్య నిదానంగా పెరిగినా.. ఇప్పుడు మాత్రం రోజుకు పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం కొత్తగా మరో 9 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 250 మార్కును దాటి 258కి చేరింది. నేపాల్‌ ఆరోగ్య శాఖ ఈ వివరాలను వెల్లడించింది. కొత్త కేసులు తొమ్మిది బాంకీ జిల్లాలోనే నమోదయ్యాయని తెలిపారు. వారిలో 8 మంది నారాయిన్‌పూర్‌ గ్రామీణ మున్సిపాలిటీకి చెందినవారు కాగా, ఒకరు మక్వాన్‌పూర్‌కు చెందిన వారని అధికారులు ప్రకటించారు. 


logo