గురువారం 04 జూన్ 2020
International - Apr 01, 2020 , 17:56:44

పాకిస్థాన్‌లో 2000 దాటిన క‌రోనా కేసులు.. 27కు చేరిన మృతులు

పాకిస్థాన్‌లో 2000 దాటిన క‌రోనా కేసులు.. 27కు చేరిన మృతులు

న్యూఢిల్లీ: పొరుగ‌దేశం పాకిస్థాన్‌లోనూ క‌రోనా విజృంభ‌న కొనసాగుతున్న‌ది. ఇప్ప‌టికే ఆ దేశంలో న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2000 మార్కును దాటి 2071కి చేరింది. అందులో పంజాబ్‌, సింధ్ రాష్ట్రాల్లోనే అత్య‌ధికంగా కేసులు న‌మోద‌మ‌య్యాయి. పంజాబ్‌ 740 కేసుల‌తో తొలి స్థానంలో ఉండ‌గా, సింధ్‌ 676 కేసుల‌తో రెండో స్థానంలో ఉన్న‌ది. ఇక కేపీకే 253, బెలూచిస్థాన్ 158, ఇస్లామాబాద్ 54, గిల్గిత్ బాల్టిస్థాన్ 84, పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్ 6 పాజిటివ్ కేసుల‌తో ఆ త‌ర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా ఆ దేశంలో 27కు చేరుకున్నాయి. 

పాకిస్థాన్‌ను ఆరోగ్య‌ప‌రంగానే కాకుండా ఆర్థికంగా కూడా క‌రోనా వైర‌స్ కోలుకోలేని దెబ్బ కొడుతున్న‌ద‌ని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆర్థిక సంక్షోభం భ‌యంతో ఆ దేశం ఇప్ప‌టికే లాక్‌డౌన్‌కు ధైర్యం చేయ‌క‌పోగా.. ప్ర‌భుత్వం విధించిన అర‌కొర ఆంక్ష‌ల‌ను కూడా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌. అంతేగాక అక్క‌డి వైద్య సిబ్బంది రోగుల‌కు సేవ‌లందించేందుకు నిరాక‌రిస్తున్నార‌ట‌. మ‌త‌పెద్ద‌లు మ‌సీదులు మూసేయ‌మంటే స‌సేమిరా అంటున్నార‌ట‌.    


logo