ఆదివారం 31 మే 2020
International - Apr 21, 2020 , 09:53:02

ఫ్రాన్స్‌లో 20 వేలు దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

ఫ్రాన్స్‌లో 20 వేలు దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌లో కరోనా మరణాల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే 547 మంది క‌రోనా బారిన‌ప‌డి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఫ్రాన్స్‌లో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల‌ సంఖ్య‌  20 వేల మార్కు దాటి 20,265కు చేరింది. క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ మొద‌టి ఐదు దేశాల్లో ఫ్రాన్స్ కూడా ఒక‌టిగా ఉంది. 

ఇక క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా ఫ్రాన్స్‌లో భారీగానే ఉన్న‌ది. దాదాపు ల‌క్షా 55 వేల మంది క‌రోనా బాధితులు ఫ్రాన్స్‌లో ఉన్నార‌ని ఆ దేశానికి వైద్య ఆరోగ్య విభాగం ప్ర‌క‌టించింది. కాగా, మొత్తం కేసుల్లో 37,409 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 97,709 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo