బుధవారం 12 ఆగస్టు 2020
International - Jul 04, 2020 , 07:54:39

బ్రెజిల్‌లో కరోనా విలయం

బ్రెజిల్‌లో కరోనా విలయం

బ్రసిలియా: లాటిన్‌ అమెరికా దేశం బ్రెజిల్‌లో కరోనా విలయతాండవం చేస్తున్నది. దేశంలో కరోనా కేసులు 15 లక్షలు దాటాయి. నిన్న ఒకేరోజు దేశంలో 42,223 మంది పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో బ్రెజిల్‌ మొత్తం కేసుల సంఖ్య 15,43,341కి చేరింది. ఈ వైరస్‌ వల్ల దేశంలో ఇప్పటివరకు 63,254 మంది మృతిచెదారు. గత 24 గంటల్లో కొత్తగా 1300 మంది మరణించారని బ్రెజిల్‌ ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా బారిన పడినవారిలో 9,45,915 మంది కోలుకోగా, 5,34,172 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. బ్రెజిల్‌లో నిన్న అత్యధికంగా 48,105 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 1252 మంది మరణించారు.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,11,90,588 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 5,29,113 మంది బాధితులు మృతిచెందారు. అమెరికాలో అత్యధికంగా 53 వేల పైచిలుకు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు 28,90,588కి చేరాయి.  

తాజావార్తలు


logo