బుధవారం 03 జూన్ 2020
International - Apr 26, 2020 , 13:20:58

ఆ దేశంలో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు

 ఆ దేశంలో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల‌ను వ‌ణికిస్తోంది. దాదాపు అన్ని దేశాల‌కు క‌రోనా వైర‌స్ విస్త‌రించింది. ఇప్ప‌టి వ‌ర‌కు త‌క్కువ న‌మోదైన దేశాల లిస్టులో అల్జీరియా ఉండగా..అక్క‌డ ఈ మ‌హ‌మ్మారి వేగంగా విస్త‌రిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 129 కొత్త కేసులు నమోదయ్యాయి. దీనితో, మొత్తం కేసుల‌ సంఖ్య 3,256 కు పెరిగింది. అలాగే కొత్తగా నాలుగు మరణాలు సంభవించాయి. ఇప్ప‌టి వ‌ర‌కు మరణాల సంఖ్య మొత్తం 419 కు పెరిగింది.కాగా అల్జీరియాలో మొదటి కేసు ఫిబ్రవరి 25న నమోదైన‌..మ‌ధ్య‌లో పెద్ద‌గా దీని ప్ర‌భావం చూపించ‌లేదు. మధ్యలో తగ్గినట్టే తగ్గిన కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. దీంతో వ్యాప్తిని నివారించడానికి, అల్జీరియన్ ప్రభుత్వం ఏప్రిల్ 29 వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించ‌గా..కేసుల తీవ్రత తగ్గకపోవడంతో లాక్ డౌన్ ను మరో 15 రోజులు పొడిగించేందుకు సిద్ద‌మ‌వుతోంది.


logo