బుధవారం 03 జూన్ 2020
International - Apr 05, 2020 , 23:42:33

కరోనా కాటుకు లిబియా మాజీ ప్రధాని మృతి

 కరోనా కాటుకు లిబియా మాజీ ప్రధాని మృతి

లిబియా: కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాల‌కు ఈ మ‌హ‌మ్మారి విస్త‌రించింది. ఇప్ప‌టికే  ల‌క్ష‌లాది జ‌నం ఈ వైర‌స్ బారిన ప‌డ‌గా వేల‌ల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. సామాన్యుడి నుంచి దేశాధినేత‌ల వ‌ర‌కు ఎవ్వ‌రినీ వ‌ద‌ల‌డం లేదు.  కరోనా మహమ్మారి బారిన పడి కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న లిబియా మాజీ ప్రధాని మహ్మూద్ జిబ్రిల్(73) ఈ రోజు కన్నుమూశారు. కరోనా పాజిటివ్ వచ్చినప్పటి నుంచి ఆయన ఈజిప్టులోని ఓ ఆసుపత్రిలో మార్చి 27 నుంచి చికిత్స తీసుకుంటున్నారు. కొన్ని రోజుల నుంచి శ్వాస తీసుకోవడం బాగా కష్టమైపోవడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. అయితే ఆదివారం  తుది శ్వాశ విడిచారు.


logo