మంగళవారం 19 జనవరి 2021
International - Dec 28, 2020 , 15:43:09

శాంటాకు క‌రోనా.. గిఫ్ట్‌లు అందుకున్న 18 మంది మృతి!

శాంటాకు క‌రోనా.. గిఫ్ట్‌లు అందుకున్న 18 మంది మృతి!

బెల్జియంలో దారుణం జ‌రిగింది. క్రిస్మ‌స్‌కు శాంటా క్లాజ్ నుంచి బ‌హుమ‌తులు అందుకున్న వారిలో 18 మంది మృతి చెందారు. కార‌ణం.. శాంటాకు అప్ప‌టికే క‌రోనా సోక‌డమే. వృద్ధాశ్ర‌మాల్లో ఉంటున్న 121 మందితోపాటు అక్క‌డి 36 మంది సిబ్బందికి శాంటా వ‌ల్ల క‌రోనా సోకింది. వీరిలో 18 మంది మ‌ర‌ణించారు. యాంట్‌వెర్ప్ అనే వృద్ధాశ్ర‌మంలోని సిబ్బంది.. అక్క‌డి వృద్ధులకు క్రిస్మ‌స్ సంద‌ర్భంగా కాస్త వినోదాన్ని పంచుదామ‌న్న ఉద్దేశంతో శాంటాను పిలిచారు. దీనికోసం అక్క‌డి వృద్ధాశ్ర‌మంలో వారి ఆరోగ్య సంర‌క్ష‌ణ చూసుకునే డాక్ట‌ర్‌నే శాంటా క్లాజ్‌గా చేశారు. 

అయితే అత‌నికి అప్ప‌టికే క‌రోనా సోకడంతో అత‌ని నుంచి బ‌హుమతులు అందుకున్న అంద‌రికీ వైర‌స్ వ్యాప్తి చెందింది. అత‌డు అక్క‌డి వ‌చ్చిన‌ప్పుడే అత‌ని ఆరోగ్యం బాగాలేద‌ని, అయితే త‌న‌కు క‌రోనా సోకిన విష‌యం అత‌నికి తెలియ‌ద‌ని వృద్ధాశ్ర‌మ నిర్వాహ‌కులు చెబుతున్నారు. త‌ర్వాత అత‌నికి టెస్ట్ చేయ‌గా.. పాజిటివ్‌గా తేలింది. ఆ త‌ర్వాత వృద్ధాశ్ర‌మంలో ఒక‌రి తర్వాత ఒక‌రికి పాజిటివ్‌గా రావ‌డం మొద‌లైంది. ఇలా మొత్తం 157 మంది వైర‌స్ బారిన ప‌డ్డారు. వృద్ధుల‌కు బ‌హుమ‌తులు ఇచ్చే స‌మ‌యంలో నిబంధ‌న‌ల‌ను స‌రిగా పాటించ‌లేద‌ని న‌గ‌ర మేయ‌ర్ విమ్ కేయ‌ర్స్ వెల్ల‌డించారు.