గురువారం 04 జూన్ 2020
International - Apr 03, 2020 , 14:54:08

కరోనా విశ్వరూపం..10లక్షలు దాటిన కేసులు

కరోనా విశ్వరూపం..10లక్షలు దాటిన    కేసులు

న్యూయార్క్‌: కరోనా వైరస్‌ వేగంగా విజృంభిస్తుండటంతో అమెరికా, యూరప్‌ దేశాలు వణికిపోతున్నాయి. కరోనా విశ్వరూపం చూపిస్తుండటంతో  రోజురోజుకీ కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది.  ఒక్క ఐరోపాలోనే 5 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 సోకిన వారి   సంఖ్య 10లక్షలు దాటింది. కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 53వేలు దాటింది.  కరోనా మరణాళ్లో సగానికిపైగా ఇటలీ..స్పెయిన్‌ దేశాల్లోనే నమోదయ్యాయి.  ఇప్పటి వరకు వైరస్‌ నుంచి 210,000 మంది కోలుకున్నారు. ఒక్క రోజు వ్యవధిలోనే అమెరికాలో వెయ్యి మంది బలయ్యారు.  కరోనా కారణంగా కోట్లాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. 


logo