ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Jul 27, 2020 , 22:11:29

ఇండోనేషియాలో ల‌క్ష దాటిన కేసులు

ఇండోనేషియాలో ల‌క్ష దాటిన కేసులు

న్యూఢిల్లీ: ఇండొనేషియాలోనూ క‌రోనా మ‌హ‌మ్మారి క్ర‌మంగా విస్త‌రిస్తున్న‌ది. గ‌త 24 గంటల్లో అక్క‌డ 1,525 మందికి కరోనా పాజిటివ్ వ‌చ్చింది. కొత్తగా నమోదైన కేసులతో క‌లిపి ఇండొనేషియాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష మార్కును దాటి 1,00,303కు చేరింది. కాగా, దేశంలో క‌రోనా ప్ర‌భావం ఎక్కువగా ఉన్న‌ ఎనిమిది ప్రావిన్సులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆ ఎనిమిది ప్రావిన్సుల‌లో కరోనాను అదుపు చేయాలని అధ్యక్షుడు జొకో విడోడో అధికారులను ఆదేశించారు. 

ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా ఇండోనేషియాలో క్ర‌మంగా పెరుగుతున్నాయి. గ‌త‌ 24 గంటల్లో అక్క‌డ‌ 57 మంది మృతిచెందగా.. ఆ దేశంలో న‌మోదైన మొత్తం మ‌ర‌ణాల‌ సంఖ్య 4,838కి చేరింది. మే చివరి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే ఇండొనేషియాలో కేసుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. లాక్‌డౌన్ ఆంక్షల వల్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలోనే సడలింపులు ఇవ్వాల్సి వచ్చినట్టు అధ్యక్షుడు జొకో విడోడో చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo