బుధవారం 28 అక్టోబర్ 2020
International - Oct 04, 2020 , 02:46:33

ఆందోళనకరంగా ట్రంప్‌ ఆరోగ్యం

ఆందోళనకరంగా ట్రంప్‌ ఆరోగ్యం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నదా.. ఆయన ఆరోగ్యం బాగానే ఉందంటూ మెడికల్‌ టీమ్‌ చేస్తున్న ప్రకటనల్లో నిజం లేదా.. అంటే అవుననే అనుమానం వస్తున్నది. ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నదని అతనికి వైద్య సేవలు అందిస్తున్న వారిలో ఒకరు తెలిపారు. రాబోయే రెండు రోజులు అత్యంత కీలకమని చెప్పారు. అంతేకాకుండా శుక్రవారం ట్రంప్‌ దవాఖానలో చేరడానికి ముందు వైట్‌హౌస్‌లో కృత్రిమంగా ఆక్సిజన్‌ పెట్టాల్సి వచ్చిందని వెల్లడించారు. తన పేరును బయటకు చెప్పడానికి ఆ వ్యక్తి ఇష్టపడలేదు. మరోవైపు, ట్రంప్‌ మెడికల్‌ టీం సభ్యుడు సీన్‌ కోన్లే శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అధ్యక్షుడి ఆరోగ్యం బాగానే ఉందని, జ్వరం లక్షణాలు లేవని తెలిపారు. ట్రంప్‌కు రెమ్‌డెసివిర్‌తో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం


logo