శుక్రవారం 22 జనవరి 2021
International - Jan 13, 2021 , 17:48:43

ఈ చెప్పులు తొడగండి.. రూ.4లక్షలు పట్టండి!

ఈ చెప్పులు తొడగండి.. రూ.4లక్షలు పట్టండి!

గత ఏడాదిలో పరుపుల ప్రకటన ఒకటి వచ్చింది. ఈ పరుపుపై హాయిగా నిద్రపోండి.. రూ.లక్షలు గెలుచుకోండి.. అంటూ ఉద్యోగం లాంటి ఆఫర్‌ ఒకటి ఇచ్చారు. గుర్తొచ్చింది కదూ! దాంతో ఆ పరుపుల కంపెనీకి ఎక్కడలేని ఉచిత ప్రచారం లభించి సేల్స్ అమాంతం పెరిగిపోయాయట. అలాంటి ఆఫర్‌ ఒకటి ఇప్పుడు మళ్లీ ప్రజలను లక్షధికారులను చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇలాంటి హ్యాండ్‌సమ్ సాలరీని అందించడానికి మరో కంపెనీ కూడా ముందుకొచ్చింది. వీరు ఆఫర్‌ చేస్తున్న ఉద్యోగం ఏంటంటే.. తాము తయారుచేస్తున్న స్లిప్పర్లను రోజులో 12 గంటలపాటు ధరించి ఉండాలన్నదే ఆ కంపెనీ ప్రకటన సారాంశం. అది కూడా నెలకు రెండు రోజలు మాత్రమేనండోయ్‌! ఇంత ఈజీ ఉద్యోగం.. మేమెందుకు అప్లై చేయకూడదు అనుకుంటున్నారు కదూ! 

లండన్‌కు చెందిన బెడ్‌రూం అథ్లెటిక్స్‌ అనే సంస్థ తాము తయారుచేస్తున్న పాదరక్షల నాణ్యతను తెలుసుకునేందుకు కొత్తరకం పరీక్షలకు సిద్ధపడింది. అయితే, వీటిని పరీక్షించేందుకు మనుషుల కోసం ఎదురుచూసిన సదరు సంస్థ.. ఎవరైతే రోజులో 12 గంటలపాటు తమ పాదరక్షలు ధరిస్తారో వారికి రూ.4 లక్షల జీతం ఇస్తామంటూ ప్రకటించింది. రెండే రెండు ఉద్యోగాలకు ఒక పురుషుడు, ఒక మహిళ అవసరమని తమ ప్రకటనలో తెలిపారు.

లాక్‌డౌన్ సమయంలో ఈ ఉద్యోగం ఎవరికైనా సరైనదే. ముఖ్యంగా విద్యార్థులకు, పార్ట్ టైమ్ వర్కర్ లేదా ఇంటి వద్దే ఉండే తల్లిదండ్రులకు సరిపోతుంది. ఈ ఉద్యోగం ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆసక్తి ఉన్నవారు బెడ్‌రూమ్ అథ్లెటిక్స్ వెబ్‌సైట్‌ www.bedroomathletics.com/లో ఉన్న దరఖాస్తు ఫాంను నింపి.. తాము ఆ ఉద్యోగానికి పరిపూర్ణ వ్యక్తి ఎందుకు? అనేది వివరించాల్సి ఉంటుంది. ఎవరైతే వివరణ ఆకట్టుకునేలా ఇస్తారో వారినే ఎంపికచేయనున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. అన్నట్లు చెప్పడం మరిచాను.. దరఖాస్తు దాఖలుకు చివరి తేదీ ఈ నెల 31. మరి ఎందుకాలస్యం.. ఇప్పుడే వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి దరఖాస్తు చేసి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.. ఆల్‌ ది బెస్ట్‌.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo