శనివారం 30 మే 2020
International - Apr 04, 2020 , 02:00:45

మహమ్మారిపై పోరాడుదాం రండి!

మహమ్మారిపై పోరాడుదాం రండి!

-ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్యసమితి పిలుపు

జెనీవా: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని తుద ముట్టించేందుకు ప్రపంచ దేశాలన్నీ ఐక్యంగా కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఐక్యరాజ్యసమితి (ఐరాస) పిలుపునిచ్చింది. ఈ మేరకు తొలి తీర్మానాన్ని గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ‘కరోనా వైరస్‌తో పోరాడేందుకు గ్లోబల్‌ సంఘీభావం 2019 (కొవిడ్‌-19)’ పేరుతో తీర్మానాన్ని తీసుకొచ్చింది. ఇదే సమయంలో మానవ హక్కులను కాపాడే అవసరాన్ని నొక్కి చెప్పింది. ఈ వైరస్‌పై పోరాటంలో జాతి, మత వివక్షకు చోటివ్వవద్దని, విదేశీయులంటే భయం పెట్టుకోవద్దని స్పష్టంచేసింది. మహమ్మారి కారణంగా జనరల్‌ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనప్పటికీ.. నిశ్శబ్ధ విధానంతో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారు. కరోనా వైరస్‌పై సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు ఐక్యరాజ్యసమితికి సంఘీభావం ప్రకటించడం అనే పేరుతో రెండో ముసాయిదా తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు.logo