సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 05, 2020 , 19:16:24

టాయిలెట్‌కు వెళ్లి ప‌న‌య్యాక ప్ల‌ష్ ఆన్ చేస్తే ఎంత‌కీ నీళ్లు రాలేదు.. చూస్తే పాము!

టాయిలెట్‌కు వెళ్లి ప‌న‌య్యాక ప్ల‌ష్ ఆన్ చేస్తే ఎంత‌కీ నీళ్లు రాలేదు.. చూస్తే పాము!

ఈ రోజుల్లో ప్ర‌తిఒక్క‌రి ఇంట్లో వెస్ట్ర‌న్ టాయిలెట్లే క‌నిపిస్తున్నాయి. ఇవి మొకాళ్ల నొప్పులు ఉండేవారికి మేలు చేసినా కొంద‌రికి మాత్రం హాని చేస్తున్నాయి. వ‌న్య‌ప్రాణుల‌కు ఎక్క‌డ ప్ర‌దేశం లేన‌ట్లు ఇదిగో ఇలా టాయిలెట్‌లోకి వ‌చ్చి కూర్చున్న‌ది. పాపం ఆ విష‌యం తెలియ‌ని మ‌హిళ పాముకి బ‌ల‌య్యేది. ఎలాగో త‌ప్పించుకున్న‌ది. అమెరికాలోని కొల‌రాడోకు చెందిన మిరండా స్టువ‌ర్ట్ అనే మ‌హిళ టాయిలెట్‌కు వెళ్లింది. ఏముంది అంద‌రిలానే ప‌న‌య్యాక ప్ల‌ష్ ఆన్ చేసింది. ఎంత‌కీ నీళ్లు రావ‌డం లేదు. ట్యాంక్‌లో నీళ్లు అయిపోయాయేమో అని చెక్ చేసింది. నీళ్లు వ‌స్తున్నాయి. ఏమైంద‌ని టాయిలెట్‌లోకి తొంగి చూసింది. అంతే..

ఒక పెద్ద పాము త‌ల క‌నిపిచ్చింది. వెంట‌నే త‌న బాయ్‌ఫ్రెండ్‌కు ఫోన్ చేసి విష‌యం తెలియ‌జేసింది. అత‌ను అపార్ట్‌మెంట్ మ్యానేజ్‌మెంట్‌కు సమాచారం అంద‌జేశాడు. వారి సాయంతో పామును బ‌య‌ట‌కు తీయ‌గా ఆ పాము ఏకంగా 4 అడుగుల పొడ‌వు ఉంది. దీనికి సంబంధించిన ఫొటోలు, సామాచారాన్ని ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. ఇంత‌లా నా జీవితంలో ఎప్పుడూ భ‌య‌ప‌డ‌లేదు అనే ట్యాగ్ జోడించింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. logo