బుధవారం 03 జూన్ 2020
International - May 14, 2020 , 19:37:14

మళ్లీ రికార్డు బ్రేక్ చేసిన ఎడ్వార్డ్

మళ్లీ రికార్డు బ్రేక్ చేసిన ఎడ్వార్డ్

ప్రపంచంలోనే అత్యంత పొట్టి వ్యక్తిగా... కొలంబియాకు చెందిన ఎడ్వార్డ్ నినో హెర్నాండెజ్‌ను రెండోసారి గుర్తించింది గిన్నీస్ బుక్. ఇతని ఎత్తు 2 అడుగుల 4.39 అంగుళాలు మాత్రమే. 2010లో మొదటిసారి ఎడ్వార్డ్ ఈ గుర్తింపు పొందాడు. ఎడ్వార్డ్ త‌ర్వాత నేపాల్‌కి చెందిన ఖగేంద్ర తాపా మాగర్ మ‌రింత పొట్టిగా ఉండ‌డంతో అత‌నికి వ‌రించింది. ఆ త‌ర్వాత నేపాల్‌కు చెందిన చంద్ర బహదూర్ డాంగీ తాపా కంటే పొట్టిగా ఉండ‌డంతో చంద్ర రికార్డును బ్రేక్ చేశాడు. ప్ర‌స్తుతం చంద్ర‌, ఖ‌గేంద్ర తాపా జీవించి లేరు కాబ‌ట్టి మ‌ర‌లా గిన్నిస్ రికార్డును ఎడ్వార్డ్ బ్రేక్ చేశాడు.

విజ‌యానికి ఎత్తు, సైజుతో ఎలాంటి సంబంధం లేదుంటున్నారు ఎడ్వార్డ్‌. నిజం చెప్పాలంటే దీని వ‌ల్లే నేను పాపుల‌ర్ అయ్యాను. నా కుటుంబానికి అండ‌గా నిల‌బ‌డ‌గ‌లిగాను.  నేను చిన్నగా ఉన్నా... నా హృదయం పెద్దది అని గిన్నీస్ బుక్ వారికి తెలిపాడు. 20 ఏళ్లప్పుడు హైపోథైరాడిజ్మ్ అనే వ్యాధి వచ్చింది. అయినప్పటికీ, వ్యాధికి తలవంచకుండా నార్మల్ లైఫ్ కొనసాగిస్తున్నాడు.


logo