బుధవారం 03 జూన్ 2020
International - May 04, 2020 , 13:00:50

కొలంబియా జ‌ర్న‌లిస్టుకు వ‌ర‌ల్డ్ ప్రెస్ ఫ్రీడ‌మ్ ప్రైజ్‌..

కొలంబియా జ‌ర్న‌లిస్టుకు వ‌ర‌ల్డ్ ప్రెస్ ఫ్రీడ‌మ్ ప్రైజ్‌..

హైద‌రాబాద్‌: కొలంబియాకు చెందిన ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్టు జిన్నెత్ బెడోయా లిమాకు .. ఈ యేటి యునెస్కో వ‌ర‌ల్డ్ ప్రెస్ ఫ్రీడ‌మ్ ప్రైజ్ ద‌క్కింది.  లాటిన్ దేశం కొలంబియాలో జ‌రుగుతున్న సాయుధ పోరాటం గురించి ఆమె అనేక క‌థ‌నాలు రాశారు. అక్క‌డ మ‌హిళ‌ల ప‌ట్ల‌ జ‌రుగుతున్న లైంగిక హింస‌కు వ్య‌తిరేకంగా ఆమె పోరాటం చేశారు. ఇంట‌ర్నేష‌న‌ల్ జ్యూరీ ఆఫ్ మీడియా ప్రొఫెష‌న‌ల్స్ చేసిన ప్ర‌తిపాద‌న మేర‌కు ఆమెకు ఈ అవార్డు ద‌క్కింది. కొలంబియాలోని ఎల్ ఎస్‌స్పెక్ట‌డారో అనే ప‌త్రిక‌కు ఆమె ప‌నిచేశారు.  2000 సంవ‌త్స‌రంలో ఆయుధాల స్మ‌గ్లింగ్‌కు సంబంధించి ఓ ఇన్వెస్టిగేటివ్ క‌థ‌నం రాసిందామె. అప్పుడు ఆమెను కిడ్నాప్ చేసి రేప్ చేశారు. ఆ త‌ర్వాత మ‌రో మూడేళ్ల‌కు ఎల్ టింపో అనే దిన‌ప‌త్రిక‌లోనూ ప‌నిచేసిన‌ప్పుడు కొలంబియాకు చెందిన సాయుధ ద‌ళాలు ఆమెను కిడ్నాప్ చేశాయి. 

ఓ మ‌హిళ‌గా, జ‌ర్న‌లిస్టుగా జినెత్ బెడోయా లిమా చూపిన తెగువ‌ను గాఢంగా గౌర‌విస్తున్న‌ట్లు యునెస్కో డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆడ్రే ఆజైలే తెలిపారు. ప్రొఫెష‌న‌ల్‌, ఇండిపెండెంట్ జ‌ర్న‌లిస్టుల పాత్ర ఇప్పుడు చాలా అవ‌స‌ర‌మ‌ని అన్నారు. బాధ్య‌తాయుత‌మైన విధుల‌ను నిర్వ‌ర్తిస్తున్న ప్రొఫెష‌న‌ల్ జ‌ర్న‌లిస్టులు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో రిస్క్‌ల‌ను ఎదుర్కొంటున్నార‌న్నారు. స‌మాజానికి అవ‌స‌ర‌మైన ప్రాథ‌మిక అవ‌స‌రాల గురించి పోరాటం చేస్తూ లిమా చూపిన ధైర్యాసాహాసాల‌ను గుర్తిస్తున్నామ‌ని జ‌ర్న‌లిస్టుల జ్యూరీ అధ్య‌క్షుడు గిసెల్లీ కౌరీ తెలిపారు.లాటిన్ దేశాల్లో మ‌హిళా జ‌ర్న‌లిస్టుల‌పై జ‌రుగుతున్న అకృత్యాల‌ను అడ్డుకోవడంలో జినెత్ కీల‌క పాత్ర పోషించిన‌ట్లు జ్యూరీ చెప్పింది. అయితే కోవిడ్‌19 సంక్షోభం నేప‌థ్యంలో ప్రెస్ ఫ్రీడ‌మ్ డే సంబ‌రాల‌ను వాయిదా వేశారు. వాస్త‌వానికి హేగ్‌లో అవార్డు కార్య‌క్ర‌మం జ‌ర‌గాల్సి ఉన్న‌ది. ప్రైజ్ కింద 25 వేల డాల‌ర్లు ఇస్తారు. 

 


logo