మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Sep 07, 2020 , 19:52:02

పైన కోటు.. కింద షార్టు... భలే ఆన్‌లైన్‌ మీటింగు..!

పైన కోటు.. కింద షార్టు... భలే ఆన్‌లైన్‌ మీటింగు..!

హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో చాలామంది వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు. దీంతో ఆన్‌లైన్‌ సమావేశాలు సాధారణమైపోయాయి. ఈ సమావేశాల సందర్భంగా పలు సరదా సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. ప్యాంటు ధరించకుండా యాంకర్లు ప్రత్యక్షప్రసారంలో పాల్గొనడం, ఆన్‌లైన్‌ సమావేశం జరుగుతున్నప్పుడు వెనుక కుటుంబ సభ్యులు నగ్నంగా తిరగడం, సమావేశంలో ఉండగానే మద్యం, పొగతాగడంలాంటి చిత్రవిచిత్ర సంఘటనలు చూశాం. ఇలాంటి ఓ వీడియోనే ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది. పైన కోటు.. కింద షార్టు వేసుకున్న ఇద్దరు ఉద్యోగుల వీడియో చూసి, నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. 

ఈ వీడియోలో బ్లూ కలర్‌ సూట్‌ ధరించిన వ్యక్తి వెనుక నుంచి ఒక పిల్లాడు వచ్చి అల్లరి చేశాడు. అది గమనించిన అతడు సహచరులకు సారీ చెప్పాడు. మళ్లీ పిల్లాడు వచ్చి డ్యాన్స్‌ చేశాడు. మళ్లీ సారీ చెప్పి డోర్‌ వేసేందుకు లేవగా అతడి షార్ట్‌ కనిపిస్తుంది. దీంతో అతడి సహచరుడు ‘నైస్‌ షార్ట్‌, జోసయ్య' అని ఆటపట్టిస్తాడు. కొద్దిసేపటికి ఆ సహోద్యోగి ఏదో పనిమీద లేవగా, అతడి బ్లూ కలర్‌ షార్ట్‌ బయటపడుతుంది. దీంతో సమావేశంలో పాల్గొన్న ముగ్గురూ నవ్వుకుంటారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో నవ్వులు పూయిస్తోంది. 2.7 మిలియన్ల మంది దీన్నివీక్షించారు.  ఫేస్‌బుక్‌లో 23,000 మంది షేర్‌ చేశారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo