శుక్రవారం 10 జూలై 2020
International - May 30, 2020 , 11:37:36

లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు జ‌ర్న‌లిస్టు అరెస్టు..

లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు జ‌ర్న‌లిస్టు అరెస్టు..

హైద‌రాబాద్‌: అమెరికాలో జాతివివ‌క్ష ఆందోళ‌న‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. మిన్నియాపోలిస్‌లో ఓ నల్ల‌జాతీయుడు పోలీసుల చెర‌లో ప్రాణాలు కోల్పోవ‌డంతో అక్క‌డ హింసాత్మ‌క నిర‌స‌న‌లు మిన్నంటాయి. అయితే ఆ సంఘ‌ట‌న‌ల‌ను లైవ్‌లో రిపోర్ట్ చేస్తున్న ఓ జ‌ర్న‌లిస్టును పోలీసులు అరెస్టు చేశారు.  సీఎన్ఎన్ మీడియా సంస్థ‌కు చెందిన జ‌ర్న‌లిస్టు ఒమ‌ర్ జిమినేజ్ .. ఆందోళ‌న‌ల‌పై లైవ్‌లో రిపోర్ట్ ఇస్తున్న స‌మ‌యంలో అత‌న్ని పోలీసులు అరెస్టు చేశారు.  ఈ ఘ‌ట‌న ప‌ట్ల ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ టిమ్ వాల్జ్ స్పందించారు. జ‌ర్న‌లిస్టు జిమినేజ్‌ను విడుద‌ల చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.  

 


logo