మంగళవారం 31 మార్చి 2020
International - Feb 17, 2020 , 12:47:31

టాంజానియాలో సీఎం కేసీఆర్‌ హరిత జన్మదిన వేడుకలు

టాంజానియాలో సీఎం కేసీఆర్‌ హరిత జన్మదిన వేడుకలు

హైదరాబాద్‌ : సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలు తెలంగాణ రాష్ట్రంలో పాటు వివిధ ప్రాంతాల్లో ఘనంగా జరుగుతున్నాయి. టాంజానియాలో సీఎం కేసీఆర్‌ హరిత జన్మదిన వేడుకలను నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ టాంజానియా అధ్యక్షుడు వంగ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో సీఎం పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మొక్కలు నాటారు. అనాథ పిల్లలకు పండ్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కేక్‌ కోసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ అధ్యక్షుడు వంగ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని కోరారు. ప్రజల ఆకాంక్షల మేరకు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని ప్రగతిపథంలో పయనించేలా సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్‌చంద్ర, కొత్త సంతోష్‌ రెడ్డి, కుశలవ్‌ రెడ్డి, సిరిపురం శ్రీనివాస్‌, కల్లోగి సైదులు, భాస్కర్‌ యాదవ్‌, సత్తు ప్రణీత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>