శనివారం 04 ఏప్రిల్ 2020
International - Feb 17, 2020 , 11:37:13

బహ్రెయిన్‌లో సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

బహ్రెయిన్‌లో సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ 66వ జన్మదిన వేడుకలు బహ్రెయిన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్‌ బహ్రెయిన్‌ ప్రెసిడెంట్‌ రాధారపు సతీష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో జరిగాయి. కేసీఆర్‌ బర్త్‌డే సందర్భంగా కేక్‌ కట్‌ చేసి.. అనంతరం మొక్కలు నాటారు. గల్ఫ్‌ దేశాల్లో కేసీఆర్‌ బర్త్‌డే వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని ప్రెసిడెంట్‌ సతీష్‌ కుమార్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ బొలిశెట్టి వెంకటేష్‌ తెలిపారు. తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్‌ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని.. రాష్ట్ర అభివృద్ధికి తమవంతు సహాయం అందిస్తామన్నారు. 

ఈ వేడుకల్లో జనరల్ సెక్రెటరీలు లింబాద్రి పుప్పల, రాజేందర్ మగ్గిడి, సెక్రెటరీలు చెన్నమనేని రాజేందర్, దేవన్న బాల్కొండ, ఉత్కం కిరణ్ కుమార్, ప్రమోద్ బొలిశెట్టి, కొత్తూరు సాయన్న, రాజు కుమార్ కుమ్మరి, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.logo