సోమవారం 23 నవంబర్ 2020
International - Nov 01, 2020 , 17:32:35

డైనోసార్‌ కాలంనాటి మొక్క.. మళ్లీ చిగురించింది..కారణమిదే..?

డైనోసార్‌ కాలంనాటి మొక్క.. మళ్లీ చిగురించింది..కారణమిదే..?

లండన్‌: 60 మిలియన్‌ సంవత్సరాల క్రితం మనుగడ సాగించిన మొక్క మళ్లీ దర్శనమిచ్చింది. డైనోసార్‌ కాలంలో కనిపించి కనుమరుగైన ఓ మొక్క జాతి మళ్లీ కనిపించి పరిశోధకులనే ఆశ్చర్యపరుస్తోంది. దీనికి గలకారణాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వాతావరణ మార్పువల్లే ఇది సాధ్యమైందని వారు తేల్చారు. క్లైమేట్‌ చేంజ్‌వల్ల ప్రతికూల ప్రభావాలేకాదు.. ఇలాంటి సానుకూల ప్రభావం కూడా ఉందని మొదటిసారి తేలింది. 

ఈ మొక్క లండన్‌లో కనిపించింది. దీనిపేరు సైకాడ్‌. యునైటెడ్ కింగ్‌డమ్‌లో సహజంగానే పెరిగిందట. భూమిపై పెరిగిన ఉష్ణోగ్రత దీనికి అనుకూలంగా మారిందట. ఇంతకుముందు ఈ రకం మొక్క శిలాజాలను అలస్కా, అంటార్కిటికాలో గుర్తించారు. ఇది చల్లని ఉష్ణోగ్రతలో పెరుగదు. అయితే, ఇటీవల యూకేలో ఉష్ణోగ్రత పెరుగడంతో ఈ సైకాడ్‌ మొక్క కూడా సహజసిద్ధంగానే పెరుగుతున్నదని నిపుణులు గుర్తించారు. ఆసక్తికరంగా ఆ మొక్క మగ,ఆడ కోన్స్‌ను ఉత్పత్తి చేస్తున్నదట.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.