మంగళవారం 20 అక్టోబర్ 2020
International - Sep 20, 2020 , 19:08:19

ఇక్కడ స్కూల్‌కు రాగానే పిల్లలు మొదట ఏంచేస్తున్నారో తెలుసా..?

ఇక్కడ స్కూల్‌కు రాగానే పిల్లలు మొదట ఏంచేస్తున్నారో తెలుసా..?

ఫెనోమ్‌పెన్‌: కరోనాను ఎదుర్కోవాలంటే ఇప్పుడు మన చేతుల్లో ఉన్న ఆయుధాలు మూడే. అవి మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను పదేపదే శానిటైజ్‌ చేసుకోవడం. కొవిడ్‌తో ప్రపంచవ్యాప్తంగా స్కూళ్లు మూతపడ్డాయి. పిల్లలు చాలారోజులు ఇంటికే పరిమితమయ్యారు. కొవిడ్‌ ఉధృతి తగ్గడంతో కొన్ని దేశాల్లో పాఠశాలలను తెరిచారు. దీంతో అక్కడ పిల్లలు మొదట స్కూల్‌కు రాగానే మొదట చేతులను సబ్బునీటితో చక్కగా కడుక్కుంటున్నారట. 


కాంబోడియాలో ఇటీవలే పాఠశాలలు తెరుచుకున్నాయి. విద్యార్థులు మళ్లీ బడిబాటపట్టారు. పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విద్యాబోధన చేస్తున్నారు. విద్యార్థులు మొదట ఇంటినుంచి రాగానే పాఠశాల ఆవరణలో చేతులను శుభ్రంగా కడుక్కున్నారంట. ఇందుకోసం అక్కడి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అలాగే, యూనిసెఫ్‌ కూడా సబ్బులు, శానిటైజర్‌, తాత్కాలిక హ్యాండ్‌వాషిన్‌ స్టేషన్లను ఏర్పాటు చేసి, సహకరిస్తోంది. ఇటీవల కొందరు విద్యార్థులు చేతులను శుభ్రం చేసుకుంటున్న ఫొటోలను యూనిసెఫ్‌ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయగా, నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.  లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo