ఆదివారం 07 జూన్ 2020
International - Mar 31, 2020 , 18:51:29

క‌రోనా ఎఫెక్ట్‌: నేపాలీలు, చైనా వ‌ర్క‌ర్ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

క‌రోనా ఎఫెక్ట్‌: నేపాలీలు, చైనా వ‌ర్క‌ర్ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

 న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి నేపాల్‌లోని మ‌ర్‌స్యంగ్డి గ్రామ‌స్తులు, చైనా వ‌ర్క‌ర్ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌కు దారితీసింది.  క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం నేపాల్ అమ‌లు చేస్తున్న ఆంక్ష‌ల‌ను చైనీయులు ధిక్క‌రించ‌డంపై నేపాలీలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో నేపాలీలు, చైనా వ‌ర్క‌ర్ల‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చెల‌రేగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, మున్సిప‌ల్, ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 

వివ‌రాల్లోకి వెళ్తే.. చైనాకు చెందిన ఓ నిర్మాణ సంస్థ నేపాల్‌లోని ల‌మ్‌జంగ్ జిల్లాలో జ‌ల‌విద్య‌త్ ప్రాజెక్టును నిర్మిస్తున్న‌ది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం చైనా నుంచి పెద్ద ఎత్తున మెటీరియ‌ల్‌ను త‌ర‌లిస్తున్న‌ది. అయితే ఇప్ప‌టికే చైనాలో క‌రోనా సోకి వేళ‌ల్లో మ‌ర‌ణాలు సంభ‌వించ‌డం, నేపాల్‌లోనూ ఐదు పాజిటివ్ కేసులు న‌మోదై ఉండ‌టం లాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో ల‌మ్‌జంగ్ జిల్లాలోని మ‌ర్‌స్యంగ్డి గ్రామ‌స్తులు చైనా ట్ర‌క్కులు త‌మ గ్రామంలోకి రాకుండా రోడ్డుపై రాళ్లు అడ్డంగా పెట్టారు. 

అయితే, ఈ విష‌యంపై మ‌ర్‌స్యంగ్డి గ్రామ‌స్తులు, లారీల్లో వ‌చ్చిన‌ చైనా వ‌ర్క‌ర్ల‌కు మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. ఆ త‌ర్వాత చైనీయులు బ‌ల‌వంతంగా రాళ్ల‌ను తొల‌గించ‌డంతో రెండు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చెల‌రేగింది. దీంతో చైనీయులు మ‌ర్‌స్యంగ్డి గ్రామ‌స్తుల‌ను క‌త్తులు చూపి బెదిరిస్తూ లారీల‌ను తీసుకెళ్లారు. ఈ ఘ‌ట‌న‌పై నేపాలీలు తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ ప్రాజెక్టులో పనిచేసే చైనా కార్మికులు ఇటీవలే చైనా నుంచి వచ్చార‌ని, వారి ద్వారా క‌రోనా విస్తిరించే ప్ర‌మాదం ఉంద‌ని, వారిని తిరిగి చైనా పంపించాల‌ని  కోరుతూ ఆందోళ‌న‌కు దిగారు. 


logo