శుక్రవారం 03 ఏప్రిల్ 2020
International - Feb 26, 2020 , 15:15:57

సర్కస్‌లో ట్రైనర్‌పై అడవి పిల్లి దాడి..వీడియో

సర్కస్‌లో ట్రైనర్‌పై అడవి పిల్లి దాడి..వీడియో

జార్జియాలోని ఖిన్వలీలో సర్కస్‌ పోటీలు జరుగుతున్నాయి. సర్కస్‌ పోటీల్లో భాగంగా ఓ ట్రైనర్‌ స్టూల్‌పై ఉన్న అడవిపిల్లిని ఆడించేందుకు ప్రయత్నించాడు. అదే క్రమంలో స్టూల్‌ అదుపుతప్పడంతో అడవి పిల్లి కింద పడిపోయింది. పిల్లి మెడకు ట్రైనర్‌ చేతిలో ఉన్న తాడు బిగుసుకుపోవడంతో ఆ పిల్లి ఒక్కసారిగా అతనిపైకి దాడి చేసింది. ట్రైనర్‌ ఎలాగోలా ఆ పిల్లి నుంచి తప్పించుకున్నాడు. అయితే సర్కస్‌ ఫీట్‌ ఆసక్తిగా చూస్తున్నవారంతా ఈ ఘటనతో భయంతో కేకలు వేశారు. ఈ వీడియో ఇపుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.
logo