శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Jul 28, 2020 , 01:26:03

దాల్చిన చెక్కతో షుగర్‌ అదుపు

దాల్చిన చెక్కతో  షుగర్‌ అదుపు

వాషింగ్టన్‌: డయాబెటిస్‌ ఉన్నవారి రక్తంలో గ్లూకోజ్‌ను(చక్కెర) నియంత్రణలో ఉంచడంలో దాల్చిన చెక్క చాలా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. టైప్‌ 2 డయాబెటిస్‌ను దాల్చిన చెక్క అదుపులో ఉంచుతుందని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రతిరోజు ఆహారం తీసుకున్న తర్వాత దాల్చిన చెక్క తింటే గ్లూకోజ్‌ స్థాయి నియంత్రణలో ఉంటుందన్నారు. గుండెజబ్బుల ముప్పు తగ్గుతుందని పేర్కొన్నారు.


logo