బుధవారం 03 జూన్ 2020
International - May 03, 2020 , 13:45:38

చ‌ర్చిల్లో ప్రార్థ‌న‌ల‌కు అనుమ‌తి.. కానీ పాట‌లు పాడొద్దు

చ‌ర్చిల్లో ప్రార్థ‌న‌ల‌కు అనుమ‌తి.. కానీ పాట‌లు పాడొద్దు

హైద‌రాబాద్‌:  జ‌ర్మ‌నీలో లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తున్నారు. దీంతో ఆ దేశంలో తాజాగా చ‌ర్చిలు తెర‌వ‌డానికి అనుమ‌తి ఇచ్చారు.  ప్రార్థ‌న‌లు చేసుకునేందుకు జ‌ర్మ‌నీ ప్ర‌భుత్వం అవ‌కాశం క‌ల్పించింది. అయితే క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు.. మ‌త పెద్ద‌లు క‌ఠిన‌మైన ఆంక్ష‌లు అమ‌లు చేసేందుకు అంగీక‌రించారు.  చ‌ర్చికి వ‌చ్చే వారి సంఖ్య‌ను త‌గ్గిస్తున్నారు.  దాంతో పాటు ఇద్ద‌రి మ‌ధ్య క‌నీసం ఆరు ఫీట్ల దూరం ఉండాలి. చ‌ర్చిల్లో పాట‌లు పాడ‌టాన్ని నిషేధించారు. ఎంద‌కంటే సామూహిక గానాల వ‌ల్ల‌ వైర‌స్ వ్యాప్తి చెందే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలిపారు. సందేశాలు ఇచ్చేట‌ప్పుడు చ‌ర్చి ఫాద‌ర్ క‌చ్చితంగా మాస్క్ ధ‌రించాలి.  సైన‌గాగ్‌ల్లో యూదులు, మ‌సీదుల్లో ముస్లిం పెద్ద‌లు కూడా ప్ర‌త్యేక రూల్స్ పాటిస్తున్నారు. వాస్త‌వానికి మార్చిలో లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు. మ‌రి షాపులు తెరుస్తున్న‌ప్పుడు.. ప్రార్థ‌నా మందిరాలు ఎందుకు తెర‌వ‌కూడ‌ద‌ని మ‌తాధికారులు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు.  దీంతో కొన్ని నియ‌మావ‌ళితో చ‌ర్చిలు తెరించేందుకు అనుమ‌తి ఇచ్చారు.

  


logo