ఆదివారం 17 జనవరి 2021
International - Dec 21, 2020 , 20:50:02

కరోనాతో అతిఎక్కువకాలం బాధపడ్డది ఇతడే..!

కరోనాతో అతిఎక్కువకాలం బాధపడ్డది ఇతడే..!

లండన్‌: కరోనా మహమ్మారి ప్రపంచాన్నే గజగజ వణికించింది. ఎంతోమందిని పొట్టనబెట్టుకుంది. చాలామంది దవాఖానపాలయ్యారు. అయితే, కొవిడ్‌ దీర్ఘకాలిక లక్షణాలున్నవారుకూడా ఒక నెలకంటే ఎక్కువ దవాఖానలో చికిత్స పొందలేదు. కానీ, బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 222 రోజులు దవాఖానలో ఉన్నాడు. ఈ మహమ్మారితో అత్యధిక కాలం బాధపడ్డ వ్యక్తి ఇతడేనట. క్రిస్మస్‌కు కొద్దిరోజులముందే డిశ్ఛార్జి అయ్యి ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. 

యూకేకు చెందిన అలీ సకల్లియోగ్లూకు 57 ఏళ్లు. కరోనాతో దవాఖానలో చేరాడు. నెల కాదు.. రెండు నెలలు కాదు.. ఏకంగా  222 రోజులు దవాఖానలోనే ఉన్నాడు. దవాఖాన సిబ్బంది మూడుసార్లు అతడిపై ఆశ వదులుకోవాలని కుటుంబ సభ్యులకు చెప్పారు. లైఫ్‌ సపోర్ట్‌ మెషీన్లను ఆపివేశారు. కట్‌ చేస్తే ఇప్పుడు కరోనాను జయించి ఇంటికి చేరాడు. పండుగకు కొద్దిరోజులముందే అతడు మహమ్మారిపై విజయం సాధించి ఇంటికి తిరిగిరావడంతో ఇదంతా క్రిస్మస్‌ మిరాకిల్‌ అని కుటుంబ సభ్యులు సంబురపడిపోతున్నారు. అతి కొద్దిరోజుల్లోనే టీకావస్తుందని.. తాను తిరిగి తన క్యాబ్‌డ్రైవర్‌ వృత్తిలోకి చేరిపోతానని అలీ ఆశాభావం వ్యక్తంచేస్తున్నాడు. 

 ఇవికూడా చదవండి..

మ‌నీ లాండ‌రింగ్ కేరాఫ్ లండ‌న్ ల‌గ్జ‌రీ ఇళ్లు

చంద్రుడిపై సాగు సాధ్య‌మేనా.. చైనా ప్ర‌యోగం ఏం చెబుతోంది?

ఆక్టోపస్‌ వాకింగ్‌ చేస్తోంది..! వీడియో వైరల్‌

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.