శనివారం 06 జూన్ 2020
International - May 11, 2020 , 10:35:00

క్రైస్ట్ రిడీమ‌ర్‌పై ఆక‌‌లి కేక‌లు..

క్రైస్ట్ రిడీమ‌ర్‌పై ఆక‌‌లి కేక‌లు..

హైద‌రాబాద్‌: బ్రెజిల్‌లోని రియోడిజ‌నారోలో ఉన్న క్రైస్ట్ రిడీమ‌ర్‌ విగ్ర‌హం.. ప్ర‌పంచ ప‌ర్యాట‌కుల‌ను నిత్యం ఆక‌ర్షిస్తూనే ఉంటుంది. కార్కొవాడో ప‌ర్వ‌తంపై ఉన్న ఆ భారీ ఏసు క్రీస్తు విగ్ర‌హంపై ఇప్పుడు ప్ర‌తి రోజూ సందేశాల‌ను ప్ర‌జెంట్ చేస్తున్నారు.  ఆ విగ్ర‌హంపై తాజాగా ఆక‌లి కేక‌ల నినాదాల్ని లైట్ల ప్రొజెక్ష‌న్‌తో తెలియ‌జేశారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వైర‌స్ వ‌ల్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌న్నీ స్తంభించాయి. దీంతో బ్రెజిల్ ప్ర‌భుత్వం విగ్ర‌హంపై హంగ‌ర్ నినాదాన్ని ప్ర‌జెంట్ చేసింది. పండ్లు, కూర‌గాయ‌ల‌తో విగ్ర‌హంపై లైట్ల ప్రొజెక్ష‌న్ చేశారు.  పోర్చుగీస్ భాష్‌లో ఆ నినాదాలు చేశారు. బ్రెజిల్‌లో 38 మిలియ‌న్ల అసంఘిత కార్మికులు తీవ్ర నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్నారు.  ఆ దేశంలో క‌రోనా వైర‌స్ కేసులు ల‌క్షా 60వేలు దాటాయి. సుమారు 11 వేల మంది మ‌ర‌ణించారు.  సావో పౌలో న‌గ‌రంలో అత్య‌ధికంగా వైర‌స్ కేసులు ఉన్నాయి. ఒక్క ఆ న‌గ‌రంలోనే 3709 మంది మ‌ర‌ణించారు. 

 


logo