గురువారం 04 జూన్ 2020
International - Apr 10, 2020 , 16:47:28

కరోనా చికిత్సకు క్లోరోక్విన్‌ సాయం

కరోనా చికిత్సకు క్లోరోక్విన్‌ సాయం

  • మార్చిలోనే ప్రకటించిన ఫ్రెంచ్‌ వైద్యుడు

పారిస్‌: కరోనా చికిత్సకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ సాయపడుతుందా? లేదా? అనే దానిపై ప్రస్తుతం పెద్దయెత్తున చర్చ సాగుతున్నది. అయితే వైరస్‌ తీవ్రత తగ్గించేందుకు ఇది పనిచేస్తుందని దిదయర్‌ రౌల్ట్‌ అనే ఫ్రెంచ్‌ వైద్యుడు మార్చిలో ప్రకటించారు. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంతో ఆ మాత్రలకు డిమాండ్‌ పెరిగింది. ఫ్రాన్స్‌లోని మారిసెల్లికి చెందిన రౌల్ట్‌ ఓ బయాలజిస్ట్‌. మలేరియాను నయం చేసేందుకు వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో కరోనా రోగులకు చికిత్స చేయవచ్చని వెల్లడించారు. 40 మంది రోగులపై చేసిన పరిశోధన ద్వారా తాను ఈ విషయాన్ని కనుగొన్నట్టు ఆయన తెలిపారు. క్లోరోక్విన్‌ తీసుకున్న సగం కంటే ఎక్కువ మంది కేవలం మూడు నుంచి ఆరు రోజుల్లో తమ శ్వాసకోస రుగ్మతల నుంచి బయటపడినట్టు వెల్లడించారు. అయితే రౌల్ట్‌ పరిశోధనలతో కొందరు నిపుణులు, వైద్యులు ఏకీభవించడంలేదు. యురోపియన్‌ యూనియన్‌ ఇంకా ఈ డ్రగ్‌కు ఆమోదం తెలుపలేదు.


logo