గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Sep 14, 2020 , 01:28:02

వుహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా!

వుహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా!

  • నా దగ్గర ఆధారాలున్నాయ్‌
  • చైనా వైరాలజిస్ట్‌ సంచలన ఆరోపణలు

బీజింగ్‌: ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ సహజ సిద్ధంగా ఏర్పడలేదని, వుహాన్‌ ల్యాబ్‌లోనే దాన్ని తయారు చేశారని చైనాకు చెందిన వైరాలజిస్ట్‌ డాక్టర్‌ లీ మెంగ్‌ యాన్‌ ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే ఈ విషయాన్ని చైనా అధికారులు దాచిపెడుతున్నారని, దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలను త్వరలోనే బయటపెడుతానని ఆమె అన్నారు. కరోనా జన్యుక్రమం మానవుడి వేలిముద్రను పోలి ఉంటుందని, ఈ ప్రత్యేకత కారణంగా వైరస్‌ను  ప్రయోగశాలలో తయారు చేసినట్టు నిరూపించవచ్చునని ఆమె అన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న యాన్‌ తనకు చైనా ప్రభుత్వం నుంచి ముప్పు పొంచి ఉన్నట్టు ఆరోపించారు.logo