మంగళవారం 07 జూలై 2020
International - Jun 28, 2020 , 16:48:44

భారత్‌తో ఘర్షణకు చైనా ప్రీప్లాన్డ్‌ శిక్షణ

భారత్‌తో ఘర్షణకు చైనా ప్రీప్లాన్డ్‌ శిక్షణ

బీజింగ్‌ : లడాఖ్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌ సైనికులతో ఘర్షణ పడేందుకు చైనా ప్రీప్లాన్‌గానే ఉన్నది. ఇందుకు తమ సైన్యానికి మార్షల్ ఆర్ట్స్‌తోపాటు పర్వతారోహణకు సంబంధించిన కఠిన శిక్షణ అందించినట్లు చైనా మీడియా వెల్లడించింది. తమ సైనికులు చురుకుగా, ఆరోగ్యంగా ఉండటానికే ఈ చర్యలు తీసుకొన్నట్టు చైనా ప్రభుత్వ మీడియా తన నివేదికలో వెల్లడించింది. 

ఈ నెల 15 న గల్వాన్‌ లోయలో చైనా-భారత్‌ సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలో భారత్‌కు చెందిన 26 మంది సైనికులు మరణించారు. చైనా వైపున కూడా పెద్ద సంఖ్యలో సైనికులు చనిపోయినట్లుగా వార్తలు వస్తున్నా చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంలేదు.

గల్వాన్‌ లోయలో భారత సైనికులతో ఘర్షణ పడేందుకు తమ సైన్యానికి మార్షల్‌ ఆర్ట్స్ తో పాటు పర్వతారోహణలో అత్యంత కఠినమైన శిక్షణ ఇచ్చి రాటుదేలేలా చేశామని చైనా అధికారిక సైనిక వార్తాపత్రిక 'చైనా నేషనల్ డిఫెన్స్ న్యూస్' నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. టిబెట్ రాజధాని లాసాలో చైనాకు చెందిన ఐదు మిలీషియా విభాగాలను మోహరించింది. ఇందులో మౌంట్ ఎవరెస్ట్ టార్చ్ రిలే టీం మాజీ సభ్యులు, మార్షల్ ఆర్ట్స్ క్లబ్ నుంచి వచ్చిన యోధులు ఉన్నారు. మౌంట్ ఎవరెస్ట్ టార్చ్ రిలే బృందం సభ్యులు పర్వతారోహణలో పని చేస్తారు. మార్షల్ ఆర్ట్స్‌ శిక్షకులు ప్రమాదకరమైన యోధులు. జవాన్లను వారిలా ప్రమాదకరంగా తయారు చేయడానికి వారిని నియమించారు.

మిలీషియా డివిజన్ అనేది చైనా అధికారిక సైన్యం కాదు. ఇది సైన్యానికి సహాయం చేయడానికి ఉద్దేశించబడినది. టిబెటన్ లాసాలో వందలాది మంది కొత్త సైనికుల శిక్షణకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కూడా ఈ వార్తాపత్రిక చూపించింది. 

చైనా మీడియాను చూపిస్తూ టిబెట్ మీడియా కమాండర్ వాంగ్ హైజియాంగ్ మాట్లాడుతూ.. ఎన్బో ఫైట్ క్లబ్‌ను చేర్చుకోవడం వల్ల త్వరగా స్పందించే దళాల బలం పెరుగుతుందని చెప్పారు. ప్రస్తుత ఉద్రిక్తత కారణంగా మాత్రమే వారి విస్తరణ జరిగిందని నివేదించ లేదు. గల్వాన్‌ లోయ వివాదం నుంచి టిబెట్‌లో చైనా మిలిటరీ చేసిన సైనిక విన్యాసాల వరకు చైనా మీడియాలో దూకుడుగా వార్తలు అందిస్తున్నారు.

ఎయిర్‌ డిఫెన్స్‌ను అమలుచేసిన భారత్‌

చైనా ఫైటర్ జెట్‌లు, హెలికాప్టర్లు.. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఏసీ) పై తిరుగుతున్నాఇ. చైనాలో ఈ కార్యకలాపాలు ఎల్‌ఏసీకి 10 కిలోమీటర్ల ప్రాంతంలో కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) పై తన సొంత భాషలో స్పందించడానికి భారత్ కూడా ఇప్పుడు సిద్ధమైంది. ఎల్ఐసీలో చైనా యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల మోహరింపునకు దీటుగా తూర్పు లడఖ్లో ముందస్తుగా 'ఆకాష్' వాయు రక్షణ క్షిపణి వ్యవస్థను మోహరించినట్లు భారత సైనిక వర్గాలు తెలిపాయి. చైనా చేష్టలను భారత సైన్యం సులభంగా పర్యవేక్షించడానికి ఇది వీలు కల్పిస్తుంది. చైనావిమానాలు ఎల్‌ఏసీని దాటగానే వాటిపై దాడి చేసి కూల్చేందుకు భారత వాయుసైన సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.


logo