బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Sep 17, 2020 , 06:53:04

భారత్‌ దృష్టి మళ్లించేందుకు డ్రాగన్‌ కొత్త ఎత్తుగడ..

భారత్‌ దృష్టి మళ్లించేందుకు డ్రాగన్‌ కొత్త ఎత్తుగడ..

న్యూఢిల్లీ : వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) ఫింగర్‌-4 ప్రాంతంపై పూర్తి పట్టు సాధించడంతో భారత్‌ దృష్టి మళ్లించేందుకు చైనా కొత్త ఎత్తుగడను వేస్తోంది. తమ ఫార్వర్డ్‌ పోస్టుల వద్ద లౌక్‌స్పీకర్లు ఏర్పాటు చేసి పంజాబీ పాటలు వినిపిస్తోంది. చైనా లౌడ్‌ స్పీకర్లు ఏర్పాటు చేసిన ప్రాంతం భారత్‌ బలగాల నిరంతర పరిశీలనలో ఉంది. భారత సైన్యం దృష్టి మరల్చేందుకు, ఒత్తిడిని తగ్గించేందుకు ఈ డ్రామాకు తెరలేపిందని సైనికవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తూర్పు లద్దాఖ్‌లో ఇరు దేశాల సైనికుల మధ్య గత 20 రోజుల వ్యవధిలో మూడుసార్లు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. పాంగాంగ్‌ సరస్సు దక్షిణ రేవు ప్రాంతాన్ని ఆక్రమించాలని చైనా ఎత్తుగడను వేసింది.

ఈ ఎత్తుగడను భారత్‌ చిత్తు చేసింది. ఈ క్రమంలో తొలిసారిగా ఆగస్ట్‌ 29-31 తేదీల మధ్య మొదటిసారిగా కాల్పులు జరిగాయి. మళ్లీ ఈ నెల 7న ముఖ్పరి పర్వతం వద్ద, పాంగాంగ్‌ ఉత్తర సరస్సు వద్ద మూడోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఇరు దేశాలు వంద రౌండ్లకుపైగా కాల్పులు జరిపినట్లు తెలిపాయి. 1962లో కూడా చైనా ఇదే తరహా ఎత్తుగడ వేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చైనా ఎల్‌ఏసీ వద్ద యధాస్థితిని ఏకపక్షంగా మార్చేందుకు పదే పదే ప్రయత్నిస్తోంది. ఎప్పటికప్పుడు వాటిని భారత్‌ చిత్తు చేస్తుండడంతో డ్రాగన్‌ కంట్రీకి మింగుడుపడడం లేదు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo