శనివారం 30 మే 2020
International - Apr 10, 2020 , 18:46:30

వుహాన్‌లో పెండ్లి క‌ళ మొద‌లైంది..

వుహాన్‌లో పెండ్లి క‌ళ మొద‌లైంది..

జ‌న‌వ‌రి 23 నుంచి ఏప్రిల్ 7 వ‌ర‌కు వూహాన్ ప్ర‌జ‌లు లాక్‌డౌన్‌లో ఉన్నారు. ఏప్రిల్ 7న ఒక్క కేసు కూడా న‌మోదు కాక‌పోవ‌డంతో త‌ర్వాతి రోజు లాక్‌డౌన్‌ను తొల‌గించింది చైనా ప్ర‌భుత్వం. దీంతో వుహాన్ ఊపిరి పీల్చుకున్న‌ది. ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో వూహాన్‌లో ఒక్క వివాహం కూడా జ‌రుగ‌లేదు. ఎప్పుడైతే లాక్‌డౌన్ తీసేస్తున్నార‌ని తెలిసిందో ఒక్క‌సారిగా వివాహ జంట‌లు పెండ్లికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం మొద‌లుపెట్టారు.

చైనీస్ టెక్ ఫ్లాట్‌ఫాం అలిపే నిర్వ‌హిస్తున్న స్థానిక వివాహ ద‌ర‌ఖాస్తు సైటుకు 300 శాతం ట్రాఫిక్ పెరిగింది. దీంతో ఆ సైటు క్రాష్‌ అయింది. అలీపే చైనీస్, మైక్రోబ్లాగింగ్ ఫ్లాట్‌ఫామ్ వైబో వారికి నిదానంగా విష‌యం వివ‌రించింది. ట్రాఫిక్ పెర‌గ‌డంతో ఆన్‌లైన్ స‌దుపాయాల‌కు భంగం క‌లుగుతుంది. ప్రాసెస్ జ‌ర‌గ‌డానికి టైం ప‌డుతుంది అని చెప్పారు. చైనాలో అత్యంత ఇష్టపడే చెల్లింపు ప్లాట్‌ఫామ్‌లలో అలిపే ఒకటి. లాక్‌డౌన్ త‌ర్వాత త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోకుంటే దేశం ఘోర‌మైన ప‌రిణామాల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  వూహాన్ ప్ర‌జ‌లు త‌మ ప‌రిస‌రాల్లో జాగ్రత్తగా ఉండాల‌ని అధికారులు కోరారు.


logo