బుధవారం 03 జూన్ 2020
International - May 20, 2020 , 01:15:20

32 ఏండ్ల తర్వాత కొడుకు దొరికాడు..

32 ఏండ్ల తర్వాత కొడుకు దొరికాడు..

  • ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీతో సాధ్యం 
  • చైనాలో ఘటన 

బీజింగ్‌: రెండేండ్ల వయసున్నప్పుడు అపహరణకు గురైన కొడుకు 32 ఏండ్ల తర్వాత తమ దగ్గరికి తిరిగి రావడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. ఫేషియల్‌ రికగ్నిషన్‌ (ముఖ గుర్తింపు) సాంకేతికత వీళ్లను ఒక దగ్గరికి చేర్చింది. ఈ ఘటన చైనాలో చోటుచేసుకున్నది. మావో జెన్‌పింగ్‌ దంపతులకు మావో అనే రెండేండ్ల కొడుకు ఉండేవాడు. 1988లో మావోని దుండగులు అపహరించారు. బిడ్డ ఆచూకీ కోసం జెన్‌పింగ్‌ దంపతులు వెతుకని చోటు లేదు. అయితే, ఫేషియల్‌ రికగ్నిషన్‌తో రూపొందించిన ఓ పైలెట్‌ ప్రాజెక్ట్‌లో చైనా పోలీసులు యాదృచ్ఛికంగా మావో చిన్ననాటి ఫొటోను ఉపయోగించారు. ప్రస్తుతం మావో ఎలా ఉంటాడో టెక్నాలజీ సాయంతో ఓ చిత్రాన్ని రూపొందించారు. ఇది ‘సీసీ టీవీ’లో ప్రసారమైంది. దీన్ని చూసిన జెన్‌పింగ్‌ దంపతులు పోలీసులను కలిసి విషయం చెప్పారు. డీఎన్‌ఏ పరీక్షలోనూ అతడు వారి కొడుకేనని తేలింది.


logo