ఆదివారం 31 మే 2020
International - Apr 25, 2020 , 11:33:33

కిమ్ వైద్యానికి చైనా వైద్యులు..?

 కిమ్ వైద్యానికి చైనా వైద్యులు..?

ఉత్త‌ర కొరియా అధినేత కిమ్‌ ఆరోగ్యంపై స‌స్పెన్స్ కొన‌సాగుతూనే ఉంది. కిమ్ ఆరోగ్యంగానే ఉన్నాడా..లేదా ప‌రిస్థితి విష‌మంగా ఉందా అనేది ఇంకా స్ప‌ష్ట‌త లేదు. అస‌లు ఆయ‌న ఆరోగ్యంపై ఇప్ప‌టివ‌ర‌కు కొరియా కూడా స్ప‌ష్ట‌మైన సమాచారాన్ని ఇవ్వ‌డం లేదు.  అయితే ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు వైద్యం అందించేందుకు..కొరియా దేశ‌పు మిత్ర‌దేశ‌మైన చైనా ఓ టీమ్‌ని అక్క‌డికి పంపింద‌ని సమాచారం. చైనా పంపిన టీమ్  ఉత్తర కొరియాకు ఎందుకు వెళ్లారు? ఆ టీమ్‌లో వైద్య నిపుణులు ఎందుకున్నార‌ని తెలియ‌డం లేదు. అయితే ఉత్త‌ర‌కొరియాలో వైద్య‌ప‌రంగా కాస్తా అక్క‌డ ఎక్స్‌ప‌ర్ట్ త‌క్కువే. అయితే ఈ నేపథ్యంలో చైనా బృందం వెళ్లిందా అనేది అర్థం కావ‌ట్లేదు. అయితే ఇండియా లాంటి స్వేచ్చాయుత దేశాల్లో ఏం జరిగినా ప్రపంచం మొత్తానికీ క్షణాల్లో తెలిసిపోతుంది. కాని  చైనా, ఉత్తర కొరియా లాంటి దేశాల్లో ఏం జ‌రిగినా... ఎంత పెద్ద విషయమైనా... రహస్యంగానే ఉంచుతారు. 


logo