గురువారం 21 జనవరి 2021
International - Jan 13, 2021 , 13:34:53

చైనా టీకా క‌రోనావాక్ స‌మ‌ర్థత 50 శాత‌మే..

చైనా టీకా క‌రోనావాక్ స‌మ‌ర్థత 50 శాత‌మే..

రియో డిజ‌నారో :  చైనాకు చెందిన సైనోవాక్ టీకా స‌మ‌ర్థ‌త 50.4 శాతంగా ఉన్న‌ట్లు బ్రెజిల్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో తేలింది.  ప‌రిశోధ‌కులు రిలీజ్ చేసిన తాజా అధ్య‌య‌నంలో ఈ విష‌యం తేలింది.  ముందుగా సూచించిన డేటాతో పోలిస్తే.. సైనోవాక్ టీకా స‌మ‌ర్థ‌త త‌క్కువ‌గా ఉన్న‌ట్లు స్ప‌ష్టం అయ్యింది.  అయితే రెగ్యులేట‌రీ అప్రూవ‌ల్ కోసం టీకా స‌మ‌ర్థ‌త క‌నీసం 50 శాతం ఉండాలి. ఆ ష‌ర‌తును సైనోవాక్ దాటింది.  చైనాకు చెందిన సైనోవాక్ టీకాను వాడేందుకు బ్రెజిల్ ప్ర‌భుత్వం ఆర్డ‌ర్లు చేసింది. కోవిడ్‌19 వ‌ల్ల ఆ దేశం తీవ్ర ప్ర‌భావానికి లోనైంది.  బీజింగ్‌కు చెందిన సైనోవాక్ కంపెనీ .. క‌రోనా వాక్ టీకాను త‌యారు చేస్తున్న‌ది.  సైనోవాక్ కోసం ఇండోనేషియా, ట‌ర్కీ, సింగ‌పూర్ దేశాలు ఆర్డ‌ర్ చేశాయి.  


logo