మంగళవారం 07 జూలై 2020
International - Jun 18, 2020 , 22:21:09

స‌హ‌జీవ‌నం గ‌డుపుతున్న‌ భార్యాభ‌ర్త‌లు.. ఎక్క‌డంటే?

స‌హ‌జీవ‌నం గ‌డుపుతున్న‌ భార్యాభ‌ర్త‌లు.. ఎక్క‌డంటే?

స‌హ‌జీవ‌నం గ‌డుపుతున్నారంటే వారు భార్యాభ‌ర్త‌లు కాక‌పోవ‌డ‌మే. కాని, వీరు వివాహం చేసుకున్న‌ప్ప‌టికీ వేరువేరుగా 30 ఏండ్ల నుంచి జీవిస్తున్నారు. పైగా విడాకులు తీసుకోవ‌చ్చు క‌దా అంటే మండిప‌డుతున్నారు. దీనికి గ‌ల కార‌ణం వింటే నోరెళ్ల‌పెట్ట‌డం మాత్రం ఖాయం.

చైనాలోని తియాంజిన్‌లో నివసిస్తున్న చెన్, అతని భార్య పెళ్లి చేసుకుని 30 ఏళ్లు అవుతుంది. ఒక‌రి వ‌స్తువులు ఒక‌రు ముట్టుకోరు. అంతేనా.. వంట కూడా వేరువేరుగా చేసుకుంటారు. ఇక‌పోతే ఫ్రిజ్ కూడా ఇద్ద‌రు భాగాలుగా చేసుకున్నారు. క‌రెంట్ బిల్లు వ‌స్తే ఇద్ద‌రు షేర్ చేసుకుంటారు. ఇక ఇద్ద‌రు ఎంతో అన్యోన్యంగా క‌లిసుండే గ‌దిలో ప‌డ‌క‌లు కూడా వేర్వేరే.. బంధువులు చెప్పేంత‌వ‌ర‌కు వీరి గురించి బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌దు.  కలిసి బ‌త‌క‌లేన‌ప్పుడు విడాకులు తీసుకోవచ్చుగా అని ప్రశ్నిస్తే.. వివాహ వ్యవస్థపై తమకు గౌరవం ఉందని, వస్తువులను వేర్వేరుగా వాడుతున్నంత మాత్రాన మాలో ప్రేమ లేదని ఎలా అనుకుంటారని ఎదురు ప్రశ్నిస్తున్నారు.

మొదట్లో ఇద్దరూ చాలా అన్యోన్యంగా కలిసి మెలిసి ఉండేవారు. ‘‘నా భర్త చాలా స్వార్థపరుడు. పెళ్లయిన కొత్తలో కేవలం తన కోసమే వస్తువులు కొనుక్కునేవాడు. ఏదీ నాతో షేర్ చేసుకొనేవాడు కాదు. చాలా సెల్ఫిష్‌గా వ్యవహరించేవాడు. దీంతో నేను సెల్ఫిష్‌గా మారితే ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకున్నా. అప్పటి నుంచి నేను కూడా అతనిలా ప్రవర్తించడం మొదలుపెట్టా. అది ఇప్పటికీ కొనసాగుతోంది’’ అని చెన్ భార్య చెప్పుకొచ్చింది. 


logo